ప్రకాశం జిల్లాకు చెందిన లోకేశ్ తిరుపతిలో చదువుతూ సహచర విద్యార్థిని కావ్యతో ప్రేమలో పడ్డాడు. ఆమె తన బంధువైన కార్తీక్ తోనూ ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇద్దరి యువకులకు ఆమె చెప్పగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రీ ప్లాన్ ప్రకారం యువతి లోకేశ్ ను సినిమాకు తీసుకెళ్లింది. వాళ్ల వెనుక సీట్లో కూర్చున్న కార్తిక్ లోకేశ్ ను కత్తితో పొడిచి అమ్మాయితో పారిపోయాడు.