శెట్టిపల్లి భూముల సమస్యల పరిష్కార కోసం వెంటనే భూ సర్వే పనులు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. గురువారం జేసీ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, రెవెన్యూ, తుడా అధికారులు, నగర పాలక సంస్థ, ఇంజనీరింగ్, ప్లానింగ్, అధికారులు, శెట్టిపల్లి సాధన సమితి ప్రతినిధులతో కలసి శెట్టిపల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.