పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, కమిషనర్ ఎన్. మౌర్య అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, కమిషనర్ ఎన్. మౌర్య జెండా ఊపి ప్రారంభించారు.