తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీబేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకటచౌదరి స్వాగతం పలికారు.