ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాష్ట్ర ప్రజలను ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతోవర్ధిల్లేలా ఆశీర్వదించమని, ఎలాంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా ఆశీర్వదించమని శ్రీవారిని కోరుకున్నానని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మంత్రి దర్శించుకున్నారు.