బాధితులను విచారించిన అట్రాసిటీ కమిటీ సభ్యులు

82பார்த்தது
బాధితులను విచారించిన అట్రాసిటీ కమిటీ సభ్యులు
దొరవారిసత్రం మండలం అనేపూడి గ్రామంలో మోహన్ ని నెల్లూరు హరినాథపురంలో ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో బాధితులకు రావాల్సిన మానిటరింగ్ రిలీఫ్ ఫండ్స్ కింద ఉద్యోగం, వ్యవసాయ భూమి, పెన్షన్ వంటి సదుపాయాలను వెంటనే కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. దీంతో అధికారులు శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. దొరవారిసత్రం విఆర్ఓ గంగాధర్, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி