తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో పోతురాజు చెంచయ్య అనే వ్యక్తి అనుమానస్పద మృతి పట్ల వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నాయుడుపేట డీఎస్సీ చెంచు బాబు గురువారం సాయంత్రం స్పందించారు. శాంతి భద్రతల దృష్ట్యా రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలన్నారు. న్యాయం కావాలన్నప్పుడు సదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.