సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలోని రైతులందరూ విధిగా రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారాపంట నమోదు చేసుకోవాలని ఏఓ గౌరి సూచించారు. సోమవారం మండలంలోని ముస్లింపాళెం, సీఎల్ఎ పల్లెలో పర్యటించి పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంనుంచి రైతులకు అందాల్సిన పథకాలు, రాయితీ, పీఎం కిసాన్ అందాలంటే పంట సాగుచేసిన ప్రతి రైతూ పంట నమోదు చేసుకోవాలన్నారు.