తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా సత్యవేడు-నాగలాపురం మధ్యలో ఉన్న గొడ్డేరు వాగులో శనివారం భారీగా వరద నీరు చేరింది. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జి పైకి వరద నీరు రావడంతో సత్యవేడు నాగలాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు వాగు దాటకుండా చర్యలు చేపట్టారు.