సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం కేంద్ర కార్యాలయాలు ఉన్న ఇందిరానగర్ పంచాయతీకి గత కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శి లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరించే వారు లేక పేరుకు పోతున్న చెత్తను ఎవరికివారే అగ్నికి ఆహుతి చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు అటకెక్కాయి. చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. కొన్ని వీధుల్లో వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు తెలిపారు.