పిచ్చాటూరు మండలంలోని వెంగళత్తూర్ శ్రీ భిక్షాండేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గురు శర్మ కుమార్ స్వామి, గురు శర్మ చంద్రన్ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పుష్పమాలను అలంకరించారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.