సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అయ్యవారిపాలెంలో పంట పొలాలు నీట మునిగాయి. ఇటీవల వేసిన వరి పంట నీట మునిగిన కారణంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం తగ్గిన వెంటనే వ్యవసాయ అధికారులు తమ గ్రామానికి వచ్చి పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నారు.