ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన భారీ వర్షాలు, వరదలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించాయి. ఈ విపత్తుతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి చిత్తూరు జిల్లాలో విశ్రాంత పోలీస్ అసోసియేషన్ 35 వేల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుకు అందజేశారు. జిల్లా ఎస్పీ, "మీ సేవాభావం ఆదర్శప్రాయంగా నిలవాలని ప్రశంసించారు. విశ్రాంత ఇన్స్పెక్టర్ ఫెడ్రిక్, ఎస్. ఐ మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.