చిత్తూరు జిల్లా నగిరి మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కమిషనర్ కేవీ. కృష్ణా రెడ్డి మంగళవారం అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా నగరిపేట, కాసిం మిట్ట, బీసీ కాలనీ, లుంగీసుగుంట, యానాది కాలనీ ప్రాంతాలలో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే కమిషనర్ కార్యాలయానికి ఫోన్ చేయాలని కోరారు.