చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని మల్లానూరు పంచాయతీ పొన్నంగూరు ఎస్సీ కాలనీలో శనివారం తహశీల్దార్ చిట్టిబాబు అధ్యక్షతన పౌరహక్కుల దినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీల హక్కులను వివరించారు. ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్, నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ కుమార్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.