విజయవాడ వరద బాధితులకు చిత్తూరు జిల్లా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అసోసియేషన్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీజేఏం చారిటబుల్ ఫౌండేషన్ కు విరాళంగా మంగళవారం మధ్యాహ్నం అందించింది. ఈ మొత్తాన్ని సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు త్యాగరాజు పాల్గొన్నారు.