చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన హేమాద్రి పింఛన్ తొలగించడం వివాదాస్పదమైంది. నాకు చిన్నతనం నుంచి వైకల్యం ఉంది. పింఛన్ రూ. 75 ఇస్తున్నప్పటి నుంచి నాకు పెన్షన్ వచ్చేది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నాయకుడు మాధవ నాయుడు వ్యక్తిగత కక్షతో పింఛన్ తొలగించారుని బాధితుడు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగాడు.