హైఓల్టేజ్ కారణంగా మండలంలోని చంగనపల్లెలో సోమవారం పలు ఇళ్లల్లో గృహోపకరణాలు కాలిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆరు నెలల క్రితం ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తులకు గురైందని గ్రామస్తులు తెలిపారు. హై వోల్టేజ్ కారణంగా ఇంట్లోని గృహోపకరణాలన్నీ కాలిపోయాయని వారు ఆరోపించారు. 70 ఇళ్లల్లో 20 టీవీలు, 15 ఫ్రిడ్జ్లు, ఐదు లాప్ టాప్ లు కాలిపోయాయన్నారు.