చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి జరిగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చిత్తూరు పోలీసు శాఖ సోమవారం పరిశీలించింది. అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ పాటూ ఇతర అధికారులు ఆలయ పరిసరాల్లో తిరిగి భద్రత ఏర్పాట్లపై తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఎస్సై ధరణిధర్ పాల్గొన్నారు.