టీటీడీలో ఫైల్స్ దగ్ధం ఘటన వైసీపీ కోవర్టుల కుట్రని టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం చిత్తూరులో ఆయన మాట్లాడుతూ టీటీడీలో కొందరు వైసీపీ కోవర్టులుగా మారి అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇంజినీరింగ్ శాఖలోని అవినీతిని కప్పిపుచ్చడానికి ఫైల్స్ దగ్ధం చేశారని మండిపడ్డారు. సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.