చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటుగారి భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. మొదటినుంచి భాస్కర్ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. వెదురుకుప్పం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారని నేతలు తెలిపారు.