AP: ప.గో జిల్లా యండగండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి పార్శిల్‌లో శవాన్ని పంపిన కేసులో ఒక్కొక్కటిగా చిక్కుముడులు వీడుతున్నాయి. ఆ మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యదని స్థానికులు గుర్తించారు. నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే శ్రీధర్ వర్మ ఇంట్లో చేతబడి చేసే సామగ్రి, మరో పెట్టే దొరికాయి. వాటిని ఎవరి కోసం సిద్ధం చేసి ఉంచాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.