బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గుంటూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో జనజీవనo స్తంభించిపోయింది. నగరంలోని శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. దింతో వాహనల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.