కురిచేడు: దేవాలయంలో సొత్తు దోచుకు వెళ్లిన దొంగలు
కురిచేడు మండలంలోని ఎన్ఎస్పి అగ్రహారం లో దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు. అగ్రహారంలో ఉన్న అంకాలమ్మ దేవాలయం తలుపుల తాళాలు పగలగొట్టి హుండీని దుండగులు చోరీ చేసుకు వెళ్లారు. హుండీలో భారీ మొత్తంలో నగదు, మొక్కుబడి బంగారం ఉందని దేవాలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.