తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.