AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ దాడి చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇవాళ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్న పవన్.. కడప రిమ్స్‌కు వెళ్లి ఎంపీడీవోను పరామర్శిస్తారు. దాడి జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంటారు.