ఏపీలో రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా సీఎం చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీతో కందిపప్పు కేజీ ధర రూ.180 నుంచి రూ.160.. ఆ తర్వాత రూ.150కి తగ్గించే విధంగా వర్తకులతో మాట్లాడామని చెప్పారు. మార్కెట్ ఫెడ్ సహకారంతో ఉల్లి, టమాటాలను తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. వచ్చే నెల నుంచి కందిపప్పు, చక్కెర కూడా బియ్యంతో పాటు అందిస్తామన్నారు.