పులివెందులలోని తన నివాసంలో గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన ఫిర్యాదుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.