పులివెందుల: నేత్రదానం చేసిన వేదమణి
పులివెందుల మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ ప్రమీలమ్మ తల్లి చవ్వా వేదామణి (86)ఆదివారం మృతి చెందింది. ఆమె కుమారులు విజయశేఖర్ రెడ్డి నేత్ర దానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకి సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ హరీత్తో కలిసి మృతురాలి స్వగృహం వెళ్లి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుగుణమ్మ సమక్షంలో కార్నియాలు సేకరించి హైదరాబాదులోని అగర్వాల్ నేత్రానిధికి పంపించారు.