బ్రహ్మంగారిమఠం మండలంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు కొందరు మందకృష్ణ మాదిగ చేస్తున్న జాతి ఉద్యమంలో భాగంగా, వ్యతిరేక భావాలను అవలంబిస్తున్న సభ్యులను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తొలగిస్తామని ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా, జిల్లా యువసేన నాయకులు ఎస్ ఆర్ కృష్ణ మాదిగను తొలగిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.