జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వరి, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని తక్షణమే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి. దస్తగిరి రెడ్డి తెలిపారు. గురువారం చెన్నూరు మండలం దౌళతాపురంలో తుఫానుతో నష్టపోయిన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.