ఆసుపత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించాలని జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు సి బాషా అన్నారు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.