శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూల కుంట మండల కేంద్రంలో పంచాయతీ అనుమతులు లేకుండా ప్లాట్లు వేసిన రెండు లే అవుట్లను బుధవారం ఎంపీడీవో మనోహర్ బాబు, పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు పరిశీలించారు. అనంతరం లే అవుట్ వేసిన రాళ్లను వారు తొలగించారు. పంచాయతీ అనుమతులు ఉంటేనే లే అవుట్స్ వేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.