లేపాక్షిలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ కరణం రామానంద్ ఆలయ అర్చకులతో కలిసి విడుదల చేశారు. అక్టోబర్ మూడవ తేదీ నుంచి 12వ తేదీ వరకు వీరభద్ర స్వామి దేవాలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితుగా వస్తుందని, భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.