గుత్తి పట్టణంలోని స్పెషల్ సబ్ జైలు మంగళవారం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శివప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ యాదవ్ సీనియర్ సివిల్ జడ్జి కాశీవిశ్వనాథ్ చారి, జైలు అధికారి మహేశ్వరుడుతో కలిసి జైలు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.