ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దు..

1168பார்த்தது
ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దు..
గుంతకల్లు నియోజకవర్గం,పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు మానసిక ఆందోళనలతో కలత చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జయన్న ఆదివారం విద్యార్థులకు సూచించారు. ఉన్నత స్థానంలో ఉన్న గొప్పవారు కూడా ఏదో ఒక పరీక్ష లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు పెద్ద అధికారులు గా విజయం సాధించారని తెలిపారు. విద్యార్థులకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది, క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా సప్లిమెంటరీ పరీక్షలు త్వరలో ఉంటాయని చెప్పారు. ఇలాంటి సందర్భంలో పిల్లలకు తల్లితండ్రులు అండగా నిలవాలని కోరారు.

தொடர்புடைய செய்தி