యర్రగుంట గ్రామంలో నూతన మారెమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ కార్య నిర్వాహకులు, మనేగాళ్ళు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో గంగ పూజ చేశారు. నూతన ఆలయం నిర్మాణం కు స్థలంను ఉచితంగా ఆలయ పూజారి కె. రామాంజినేయులు ఇచ్చారు. మారెమ్మ దేవతా విగ్రహాన్ని మేళతాళాలతో గ్రామంలో ఘనంగా ఊరేగించారు.