తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి జన్మదిన వేడుకలు గురువారం యర్రగుంట లో కుందుర్పి మండలం క్లస్టర్ ఇన్చార్జి, మాజీ సర్పంచ్ బి. శివలింగప్ప మరియు గ్రామ కన్వీనర్ కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామం లో జన్మదిన వేడుకలు సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కేక్ ను కట్ చేసి తెలుగు దేశం పార్టీ నాయకులు ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల క్లస్టర్ ఇన్చార్జి బి. శివలింగప్ప మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాణం కేవలం చంద్రబాబు నాయుడు కే సాధ్యం అని చెప్పారు. ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపేందుకు చంద్రబాబు నాయుడు ను మరొక సారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.