ఆదివారం యర్రగుంట గ్రామం లో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బి శివలింగప్ప అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఉపాద్యాయులు, వక్తులుఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యమ్. యస్. రాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితులు సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అని చెప్పారు. ఉపాద్యాయుడు అబ్దుల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలని సామాజికంగా ఆర్థికంగా చూడాలని తెలిపారు. ఓబయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈరణ్ణ, ఆనంద్, నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.