ధర్మవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించి 20 మద్యం షాపులకు టెండర్లను ఈనెల 9వ తారీకు వరకు స్వీకరిస్తామని ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ చంద్రమణి పేర్కొన్నారు. మంగళవారం ధర్మవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ ఈనెల 11వ తారీఖున పుట్టపర్తి లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ తీస్తామని ఆశావాహులు టెండర్లు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.