అనంతపురంఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్ మెన్లను ఆదివారం వెనక్కు పంపారు. రాప్తాడు వైసీపీ నేత మహానందరెడ్డికి ప్రభుత్వం గన్ మెన్ లను కేటాయించడంతో నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానందరెడ్డి గతంలో ముగ్గురి హత్య కేసులో నిందితుడు. దీంతో సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్మెన్లను ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.