తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కువశాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకు వచ్చిన నీటిపారుదలశాఖామంత్రి నిమ్మల రామానాయుడిని పెద్దవడుగూరు మండలంలోని కాసేపల్లి వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న చాగల్లు, పెండేకల్లు, ముచ్చుకోట రిజర్వాయర్లకు, యాడికి, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కు నీరివ్వాలని కోరారు.