రాయదుర్గం పట్టణంలోని 3 వార్డులో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మున్సిపాలిటీ సిబ్బంది కాలనీలలోని చెత్తాచెదారం తొలగించారు. వారు మాట్లాడుతూ.. కాలనీలలో ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు రావన్నారు. డ్రైనేజీలో చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాలనీలో పరిశుభ్రత ఉంటే ఎటువంటి రోగాలు రావన్నారు.