బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బుధవారం ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు ప్రజలకు సూచించారు. మరోపక్క గుత్తిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో రోడ్డుపై డ్రైనేజీ మురుగునీరు రావడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.