రాంబిల్లి సెజ్ వసంత పరిశ్రమలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందివ్వాలని బుధవారం సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము మాట్లాడుతూ ఎస్ఈజెడ్ ఫార్మా పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం, సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమ ల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని మండిపడ్డారు.