పాయకరావుపేట నియోజకవర్గంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు కార్యక్రమం పాయకరావుపేట ఎంపీటీసీ గుల్ల నాగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుల్ల నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల నుండి 4000 రూపాయల వరకు పెంచడం జరిగింది అన్నారు.