కొత్త అమావాస్య సంధర్భంగా సోమవారం పాయకరావుపేట మండలం కుమారపురంలో గ్రామ దేవతలుగా కొలువై ఉన్న కనక దుర్గాలమ్మ, నూకాలమ్మ, మరిణిమ్మ అమ్మవార్ల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం 8 గంటల నుంచే ఆయా ఆలయాల వద్దకు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొత్త అమావాస్య పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచీ భక్తులు కుమారపురం తరలివచ్చారు.