పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ల నియామకంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని కీలకమైన రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా తనను నియమించినందుకుగాను ప్రధాని నరేంద్ర మోడీకి, స్పీకర్ ఓం బిర్లా కి, అమిత్ షాకి, జేపీ నడ్డా కి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి గురుతరమైన బాధ్యతలు అప్పగించారని వారికి రుణపడి ఉంటానన్నారు