అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని వెల్చూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన నూకాలమ్మ అమ్మవారిని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పాలాభిషేకం నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.