ధరల పెరుగుదలపై ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పెందుర్తి మండలం చిన్న ముషిడివాడలో ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల పాలకులకు పట్టడం లేదన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.